Politics

తమిళిసైని కలిసిన కలిసిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు

తమిళిసైని కలిసిన కలిసిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు

కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్టు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z