Politics

తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న 50 మందికి పైగా

తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న 50 మందికి పైగా

తెలంగాణ అసెంబ్లీలో ఈసారి 51 మంది తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఏకంగా 8 మంది కొత్తవారు శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి మెదక్‌ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారిలో దాదాపు 18 మంది ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారే కావడం గమనార్హం. వీరంతా క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేకుండా తొలిసారిగా పోటీ చేసి గెలుపొందినవారే కావడం విశేషం. జిల్లాలవారీగా శాసనసభకు మొదటిసారి ఎంపికైన సభ్యు లు వారి నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

అలంపూర్‌ – విజయుడు

నారాయణపేట – పర్ణికారెడ్డి

మక్తల్‌ – వాకిటి శ్రీహరి

దేవరకద్ర – మధుసూదన్‌రెడ్డి

వనపర్తి – తూడి మేఘారెడ్డి

జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి

కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో..

పాలేరు – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వైరా – రాందాస్‌నాయక్‌

అశ్వరావుపేట – ఆదినారాయణ
సత్తుపల్లి – మట్టా రాగమయి

భద్రాచలం – తెల్లం వెంకట్రావు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

వరంగల్‌ పశ్చిమ – నాయిని రాజేందర్‌రెడ్డి

వర్ధన్నపేట – కేఆర్‌ నాగరాజు

పాలకుర్తి – యశస్వినిరెడ్డి

మహబూబాబాద్‌ – మురళీనాయక్‌

డోర్నకల్‌ – రాంచంద్రునాయక్‌

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణరావు

జనగామ – పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా..

హుజురాబాద్‌ – పాడి కౌశిక్‌రెడ్డి

వేములవాడ – ఆది శ్రీనివాస్‌

కోరుట్ల – డాక్టర్‌ సంజయ్‌

మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ

రామగుండం – రాజ్‌ఠాకూర్‌

ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌

చొప్పదండి – మేడిపల్లి సత్యం

హుస్నాబాద్‌ -పొన్నం ప్రభాకర్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో..

దుబ్బాక – కొత్తప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌

ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ – లాస్య నందిత

మల్కాజిగిరి – మర్రి రాజశేఖర్‌రెడ్డి

తాండూరు – మనోహర్‌రెడ్డి

ఉప్పల్‌ -లక్ష్మారెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో..

ఆదిలాబాద్‌ – పాయల్‌ శంకర్‌

బోథ్‌ – అనిల్‌జాదవ్‌

మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు

సిర్పూర్‌ పాల్వాయి హరీశ్‌

చెన్నూర్‌ – వివేక్‌

ఖానాపూర్‌ – ఎడమ బొజ్జు

ముథోల్‌ – రామారావుపటేల్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో..

ఆలేరు – బీర్ల ఐలయ్య

నాగార్జునసాగర్‌ జయవీర్‌రెడ్డి

మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి

భువనగిరి – కుంభం అనిల్‌రెడ్డి

తుంగతుర్తి – మందల సామ్యేల్‌

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో..

కామారెడ్డి – వెంకటరమణారెడ్డి

ఆర్మూర్‌ – రాకేశ్‌రెడ్డి

నిజాబాద్‌రూరల్‌ – డాక్టర్‌ భూపతిరెడ్డి,

నిజామాబాద్‌ – అర్బన్‌ సూర్యనారాయణగుప్తా

జుక్కల్‌ – లక్ష్మీకాంతారావు

ఎల్లారెడ్డి – మదన్‌మోహన్‌రావు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z