తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను రాష్ట్ర పోలీసులు సిద్ధం చేశారు. ఆరు ఇన్నోవా వెహికల్స్‌ను ప్రోటోకాల్ అధికారులు రాజ్ భవన్ వద్ద సిద్ధం చేశారు. కాగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. వీరి పేర్లనే దాదాపుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.ఇవాళ రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఎస్సీ వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎస్టీ నుంచి సీతక్క డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం దర్బార్ హాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 175 మంది ఆసీనులయ్యే విధంగా అరేంజ్మెంట్స్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త సీఎం కొత్త వాహనంలో సచివాలయానికి చేరుకుంటారు.
👉 – Please join our whatsapp channel here –