Politics

కవరింగ్ కోమటిరెడ్డి

Komatireddy Rajagopal Reddy Takes UTurn And Says He Will Be With Congress

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నారు. బీజేపీలో చేరాలని ప్రయత్నించిన ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చేసేది లేక మళ్లీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న మెున్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదంటూనే పదేపదే తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. తాను పార్టీపై ఉన్న అభిమానంతో కాస్త తీవ్ర విమర్శలు చేశానని అంగీకరించారు. అవికూడా పార్టీ మనుగడ కోసమే తప్ప వేరే దాని కోసం కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం మారితే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అదే అన్నానని చెప్పుకొచ్చారు.