Business

7.76 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించిన ప్రభుత్వం

7.76  కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలైనట్లు  వెల్లడించిన ప్రభుత్వం

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు ఈనెల 2 వరకు 7.76 కోట్లకు పైగా దాఖలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 31 వరకు సమయం ఉన్నందున, ఈ సంఖ్య మరికొంత పెరుగుతుందని భావిస్తున్నట్లు, సోమవారం లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలియజేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న వారిలో 10.09 కోట్ల మంది, 2021-22 ఆదాయానికి గాను పన్నులు చెల్లించినట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికి గాను రూ.16.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ఇందులో ఆదాయపు పన్ను వాటా రూ.8.08 లక్షల కోట్లు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z