Movies

బాలకృష్ణ మాజీ పీఏకు ఏసీబీ కోర్టు జైలుశిక్ష

HIndupur MLA Nandamuri Balakrishna Ex PA Sentenced To Jail For Illegal Assets

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. బాలకృష్ణ పిఏ శేఖర్ కు జైలు శిక్ష విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రుజువుకావడంతో మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.3లక్షలు జరిమానా విధించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శేఖర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బాలయ్య సినిమాల్లో బిజీబిజీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉంటూ బాలకృష్ణపేరుతో శేఖర్ అక్రమ వసూళ్లకు పాల్పడే వారని ప్రచారం ఉంది. హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పీఏ అక్రమ వసూళ్లు అరాచకాలపై టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృస్ణకు నేరుగా ఫిర్యాదు సైతం చేశారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఉండేవారిపట్ల బాలయ్యకు చెడుగా చెప్పేవారని కార్యకర్తలు ఆరోపించేవారు. దాంతో నియోజకవర్గంలో టీడీపీలో విబేధాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారకుడు అయ్యారని పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. ఆరోపణలు తీవ్రం కావడంతో బాలకృష్ణ శేఖర్‌ ను తప్పించారు. ఇకపోతే శేఖర్‌పై 2008లో కేసు నమోదుకాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది.