తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీకి రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్‌గాంధీ వెళ్లిపోయారు.
నా బాధ్యత అంత వరకే: డీకే శివకుమార్
అంతకుముందు తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కర్ణాటక డిప్యూటీ సీఎం, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్ స్పందించారు. సీఎల్పీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పడం వరకే తన బాధ్యత అని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు సీఎల్పీ నేత ఎంపిక ఉంటుందని సోమవారం నిర్వహించిన సమావేశంలో తీర్మానించారని గుర్తుచేశారు. సీఎల్పీ అభిప్రాయంపై నివేదిక ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం అభ్యర్థి, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –