భారత మహిళల డబుల్స్ జంట అశ్వినీ పొన్నప్ప(Ashwini Ponnappa), తనీష క్రాస్టో(Tanisha Crasto) బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న పొన్నప్ప, తనీషా జోడీ నాలుగు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్ దక్కించుకుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం రెండో సీడ్ నిలబెట్టుకుంది.
ఇక పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) ఒక్కడే టాప్ -10లో నిలిచాడు. లక్ష్యసేన్ 17వ ర్యాంక్, కిడాంబి శ్రీకాంత్ 24వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న యువ కెరటం ప్రియాన్షు రజావత్ టాప్ – 30లో చోటు దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
ఈ ఏడాది జోరు మీదున్న సాత్విక్ – చిరాగ్ జోడీ 19వ ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించింది. ఇక మహిళల డబుల్స్‌లో పొన్నప్ప, తనీష జోడీ కూడా అద్భుతంగా రాణించింది. అబూదాబీ మాస్టర్స్ సూపర్ 100, నేట్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టోర్నీల్లో ఈ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు ఇటీవలే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్లో అదరగొట్టినప్పటికీ రన్నరప్‌తో సరిసెట్టుకుంది.
👉 – Please join our whatsapp channel here –