మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాట) 3వ బోర్డు మీటింగ్ ఫిలడెల్ఫియా, క్రౌన్ ప్లాజాలో ఘనంగా జరిగింది. మాట వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల ఆధ్వర్యంలో జరిగిన ఈ బోర్డు మీటింగ్లో సలహా మండలి, బోర్డు,గౌరవ సలహాదారులు సహా పలువురు మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై సమావేశంపై చర్చించారు.
ప్రధానంగా ఏప్రిల్లో నిర్వహించనున్న మాట మొదటి కన్వెన్షన్ గురించి ప్రధానంగా ముచ్చటించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ గురించి చర్చించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల డాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
యువతి, యువకుల సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆడియన్స్లో జోష్ నింపాయి. ఇక సింగర్స్ తమ గాత్రంతో మైమరపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని సన్మానించి, సత్కరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో మాట మొట్టమొదటి కన్వెన్షన్ గ్రాండ్గా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు సభ్యులు వివరించారు.
👉 – Please join our whatsapp channel here –