Politics

జారిపడ్డ కేసీఆర్‌

జారిపడ్డ కేసీఆర్‌

భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z