Politics

కేసీఆర్ హెల్త్‌ బులెటిన్‌

కేసీఆర్ హెల్త్‌ బులెటిన్‌

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని తెలిపారు.

‘‘బాత్‌రూమ్‌లో జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలి. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు’’ అని హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z