Politics

అనుమతి లేనందున కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావొద్దు!

అనుమతి లేనందున కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావొద్దు!

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు మాజీ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) తెలిపారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. అనుమతి లేనందున కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావొద్దని, కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తారని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ ఉన్నారని, కార్యకర్తలు ఆందోళన పడొద్దన్నారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌కు వైద్యులు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z