2020-21 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ తీసుకొని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (NMC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు మరో ప్రయత్నానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం NMC ఓ ప్రకటన విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొంది తమ మొదటి ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులను మాత్రమే మరో ప్రయత్నం (ఐదో అటెంప్ట్)కు అనుమతిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈ బ్యాచ్‌పై కొవిడ్ ప్రభావం పడినందున వారికి మాత్రమే అదనపు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది. మున్ముందు ఇలాంటివి ఇవ్వబోమని తేల్చి చెప్పింది.
👉 – Please join our whatsapp channel here –