డ్రగ్స్ సరఫరా ముఠాలకు రాష్ట్రంలో చోటులేదని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ ముఠాలను సహించేది లేదని.. వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ నూతన సీపీగా బుధవారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు. హైదరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించడం సవాళ్లతో కూడుకున్నది. డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ మూలాలుంటే సహించేది లేదు. దీనిపై సినీ రంగానికి చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తాం. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తాం. అధికారులు, సిబ్బంది సహకారంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తా. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు కృషి చేస్తాం’’ అని సీపీ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –