లార్డ్స్ మైదానంలో ఇవాళ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది.
మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.
అయితే ఆశ్చర్యంగా సూపర్ ఓవర్ కూడా టై అయింది.
ఈ క్రమంలో మ్యాచ్‌లో ఇంగ్లండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు.
ఇంతకు ముందు వరకు 3 వరల్డ్ కప్‌లలో ఇంగ్లండ్ ఫైనల్స్‌కు చేరుకున్నా కనీసం ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు.
అయితే ఇవాళ్టి విజయంతో ఇంగ్లండ్‌కు ఆ ఒక్క లోటు తీరిపోయింది.