`రాజుగారిగది`.. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్ కావడంతో దీనికి ఫ్రాంచైజీ స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా `రాజుగారిగది 2` రూపొందింది. ఇందులో నాగార్జున అక్కినేని, సమంత వంటి స్టార్స్ నటించారు. కాగా ఇప్పుడు మూడో పార్ట్‌గా `రాజుగారిగది 3` ప్రారంభమైంది. ముందు తమన్నా ప్రధాన పాత్రలో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అయితే డైరెక్టర్ ఓంకార్ ముందు చెప్పిన స్క్రిప్ట్‌కు.. తర్వాత స్క్రిప్ట్‌కు పొంతన లేకపోవడంతో మిల్కీ బ్యూటీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను సంప్రదిస్తే.. ఆమె భారీ రెమ్యునరేషన్ అడిగింది. దీంతో తమ బడ్జెట్ పరిధిలో మెయిన్ లీడ్‌గా అవికాగోర్‌ను నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా.. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం అందాల యాంకర్ రష్మీ గౌతమ్‌ను తీసుకున్నారట. ఇది వరకే కొన్ని హారర్ చిత్రాల్లో నటించిన రష్మి గౌతమ్ మరోసారి హారర్ కామెడీ `రాజుగారిగది 3` లో నటిస్తుందో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
రాజుగారిగదిలోకి రష్మి
Related tags :