ఆధార్ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై యూఐడీఏఐకు మెయిల్ లేదా 1947 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి సూచించారు.
👉 – Please join our whatsapp channel here –