Politics

మరోరూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తాం!

మరోరూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తాం!

పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సిల్ సమావేశాలు, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో శాసనసభ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న కాళీ స్థలంలో తన క్యాంపు ఆఫీస్ నిర్మాణం చేస్తామన్నారు. ప్రజా భవన్‌లో ఇంకో బిల్డింగ్ ఉందని.. అది ఇంకో మంత్రికి ఇస్తామన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోట్‌కు మెట్రో ఉపయోగకరంగా ఉండదని.. మరోరూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తామని సీఎం తెలిపారు.

ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు. ప్రజాభవన్‌లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటామని.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ 12, 14 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని తెలిపారు. రేపు (శుక్రవారం) బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z