కేంద్ర ఎన్నికల సంఘానికి భారాస (BRS) సమర్పించిన 2022-23 ఆడిట్ రిపోర్టులో తమ పార్టీకి రూ.1,149.84 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొంది. ‘ఇందులో రూ.967 కోట్లు 12 నెలలకు మించిన మెచ్యూరిటీ పీరియడ్‌తో షెడ్యూల్డ్ బ్యాంకుల్లో డిపాజిట్‌గా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఎస్బీఐకి చెందిన 8 బ్రాంచుల్లో రూ.180 కోట్ల మేర నిల్వలున్నాయి. జిల్లా పార్టీ బ్యాంకు ఖాతాల్లో రూ.39.86 లక్షలు, చేతిలో నగదు కింద రూ.77,617 ఉన్నాయి. ఇతర ఆస్తుల రూపంలో రూ.2.02 కోట్లు ఉన్నట్లు’ ఆడిట్ నివేదికలో వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రూ.480 కోట్లు ఉండగా.. ఏడాది కాలంలో 139.37% పెరిగాయి.
భారాసకు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆదాయం రూ.737.67 కోట్లు, ఖర్చులు రూ.57.47 కోట్లు వచ్చాయి. మిగిలిన రూ.680.20 కోట్లను జనరల్ ఫండ్‌కు బదిలీ చేసింది. 2022 మార్చి 31 నాటికి రూ.218.11 కోట్లు సమకూరగా ఈ సంవత్సరం 238% పెరిగింది. ఖర్చులు రూ.27.48 కోట్ల నుంచి రూ.57.47 కోట్ల(105%)కు పెరిగాయి. జనరల్ ఫండ్‌కు తరలించిన నిధులు రూ.190.17 కోట్ల నుంచి రూ.680.20 కోట్లకు చేరాయి.
గత ఆర్థిక సంవత్సరం వరకు పార్టీకి రూ.193 కోట్ల విరాళాలు రాగా, ఏడాది కాలంలో రూ.683 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం రూ.16.12 కోట్ల నుంచి రూ.54.16 కోట్లకు పెరిగింది.
ఎన్నికలు, ఉద్యోగులు, పరిపాలన, ఇతరత్రా అవసరాల కోసం ఈసారి రూ.56.86 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రయాణాలకు రూ.12.30 కోట్లు, ప్రకటనలు, ప్రచారాలకు రూ.14.80 కోట్లు, దిల్లీ ఆఫీసు అద్దె కోసం రూ.1.77 కోట్లు, సిబ్బంది వేతనాలు, సంక్షేమం కోసం రూ.1.20 లక్షలు వెచ్చించారు.
👉 – Please join our whatsapp channel here –