DailyDose

విశాఖలో మరో అగ్నిప్రమాద ఘటన

విశాఖలో మరో అగ్నిప్రమాద ఘటన

విశాఖ ఇండస్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రామ్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. గతంలో అదే బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా రెండో ఫ్లోర్‌లో ఉన్న ఇంట్లో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దాదాపు రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.. మంటలకు ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z