‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి తర్వాతి సినిమాని ఇంకా సెట్స్పైకి తీసుకెళ్లడం లేదు. రవితేజ హీరోగా ‘మహా సముద్రం’ అనే పవర్ఫుల్ సబ్జెక్ట్ను రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఇందులో రవితేజ సరసన హీరోయిన్గా అదితీరావ్ హైదరీని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. గత ఏడాది ‘సమ్మోహనం, అంతరిక్షం’ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు అదితీ. ప్రస్తుతం సుధీర్బాబు, నాని చేస్తున్న ‘వి’ సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ సినిమా సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది.
రవితేజతో హైదరీ
Related tags :