Devotional

అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్

అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్

నూతనంగా నిర్మించిన రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య అంతా సిద్ధమైంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మహా ప్రారంభోత్సవం.. తర్వాత వచ్చే 100 రోజుల పాటు కొనసాగుతుంది. తద్వారా భక్తులు ఈ పవిత్ర నగరానికి చేరుకోవచ్చచు. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ వంటి ప్రధాన నగరాల నుండి యాత్రికుల కోసం అయోధ్యకు నడుస్తాయి. డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మరిన్ని రైళ్లు నడుపబడుతాయని రైల్వే పేర్కొంది. పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారని దృష్టిలో ఉంచుకుని అయోధ్య స్టేషన్‌ కూడా రీడిజైన్ చేయబడింది. ప్రత్యేక రైళ్లతో పాటు, రైల్వేలోని క్యాటరింగ్, టికెటింగ్ విభాగం కూడా ఈ 10-15 రోజుల ప్రారంభోత్సవంలో యాత్రికులకు 24 గంటలూ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రామాలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల డిమాండ్‌ను తీర్చడానికి అధికారులు అనేక ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 50,000 మంది వ్యక్తుల రాకపోకలను నిర్వహించగలదు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా సిద్ధమవుతుంది. శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన ఒక రోజు తర్వాత జనవరి 23 నుండి ఆలయం ప్రజలకు తెరిచి ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని జనవరి 22, 2024న ప్రారంభించనున్నారు. ఆలయ ప్రాంగణంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లకు రామమందిర్ ట్రస్ట్ బాధ్యత వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులకు 320 అడుగుల దూరం నుండి రాముడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభోత్సవం రోజున రామభక్తులందరికీ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను దర్శనం కోసం నాలుగు లైన్లలో ఏర్పాటు చేయగా, ఒక్కరోజులో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది శ్రీ రాముని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z