Devotional

బెజవాడ దుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

Sakambari Festival Begins In Vijayawada Durga Temple

1.ఇంద్రకీలాద్రి పై శాకంబరి ఉత్సవాలు ప్రారంభం – ఆద్యాత్మిక వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాయగూరలు, పండ్లరూపంలో అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు . ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు సుప్రభాత సేవ మినహా అన్ని రకాల ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఈ నెల 16 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగనున్నాయి.
2. శ్రీవారి సేవలో రాష్ట్రపతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్రపతివెంట ఉన్నారు. ఉదయాన్నే రాష్ట్రపతి స్వామివారి పుష్కరిణిలోకి ప్రవేశించి పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవరాహస్వామిని దర్శించుకుని.. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు వెళ్లారు. తితిదే ఉన్నతాధికారులు, అర్చక స్వాముల నుంచి ఇస్తికఫాల్ స్వాగతం అందుకున్నారు. శ్రీవారి సన్నిధికి మేళతాళాలతో ఆయనను తీసుకెళ్లారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం శ్రీనివాసుని శేష వస్త్రాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఈ సందర్భంగా స్వామివారి మహిమ, చరిత్ర, మందిరంలోని ఉప ఆలయాల గురించి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు ద్వారా రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. ధ్వజస్తంభానికి మొక్కుకుంటూ రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం అందజేయగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తితిదే ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి అందజేశారు.
3. దుర్గమ్మకు భాగ్యనగర బంగారు బోనం
శాకంబరి ఉత్సవాల తొలి రోజున ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన జగన్మాత దుర్గమ్మకు హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పణ కార్యక్రమం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. 500 మంది భక్తుల బృందం నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. సారె, బంగారు బోనాన్ని మూలవిరాట్ దుర్గమ్మకు చూపించిన అనంతరం వైదిక కమిటీ సభ్యులకు అందజేశారు.
4. గోటి తలంబ్రాల కోసం వరి సాగు ప్రారంభం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శ్రీరామ నవమి వేళ నిర్వహించే వార్షిక కల్యాణ మహోత్సవంలో గోటి తలంబ్రాలను ఉపయోగించే పద్ధతి కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. వీటిని అందించేందుకు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు దీర్ఘకాలిక ప్రణాళికను మొదలుపెట్టారు. నాణ్యమైన ధాన్యాన్ని ప్రత్యేక కలశాలలో ఉంచి ఊరేగింపుగా భద్రాచలం తీసుకుని వచ్చి దేవాలయంలో ఇటీవల వీటికి పూజలు చేశారు. ఇలా పూజించిన ధాన్యాన్ని ఆ జిల్లాలోని ఎంపిక చేసిన పొలంలో ఆదివారం చల్లారు. ఆంజనేయుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి వానర మహా వీరుల వేషధారణలో భక్తులు నాగలి దున్నుతుండగా రాముడి వేషధారణలో ఉన్న మరో భక్తుడు ధాన్యాన్ని ఆశీర్వదిస్తుండగా… ధాన్యాన్ని చల్లారు. భక్తులు ఇందులో పాల్గొని కోటి తలంబ్రాల పంటకు అంకురార్పణ పూజలను ఘనంగా నిర్వహించారు. ఎంతో ఉల్లాసంగా కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక సందడిని నింపారు. ఇక్కడ పండిన ధాన్యాన్ని గోటితో వొలిచి తలంబ్రాలుగా మార్చి వాటిని భద్రాచలం, కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయాలకు అందించనున్నట్లు నిర్వాహకుడు కల్యాణం అప్పారావు తెలిపారు.
5. వారాంతాల్లో సిఫార్సు లేఖల స్వీకరణ నిలిపివేత
శ్రీవారి భక్తుల రద్దీ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఇచ్చే సిఫార్సు లేఖలను ఆగస్టు 18 వరకు స్వీకరించబోమని తితిదే తెలిపింది. వారాంతాల్లో కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టిక్కెట్లను కేటాయిస్తామని పేర్కొంది. 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, చంద్రగ్రహణం, 17 ఆణివార ఆస్థానం కారణంగా సిఫార్సు లేఖలను స్వీకరించడంలేదని స్పష్టం చేసింది. మంగళవారం కేవలం 5 గంటల పాటే శ్రీవారి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకే దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7 గంటల నుంచి 17 వేకువజామున 5 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. మరోవైపు తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కూడా భక్తులు 3 కిలోమీటర్ల మేర బారులుదీరి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
6. వైభవంగా శాకంబరి ఉత్సవం-తొలిరోజు 70 వేల మందికి దర్శనం
మూడు రోజులపాటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే శాకంబరి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మూలవిరాట్టు దుర్గమ్మ విగ్రహంతోపాటు ఆలయ ప్రాంగణాన్ని దేవస్థానం అధికారులు వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు 70వేల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.
7. రేపు కసాపురం ఆలయం మూసివేత
చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ విజయ్సాగర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటలకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
8. 26వ తేదీ నుంచి హజ్ విమానాలు ప్రారంభం
హజ్ యాత్రీకుల విమానాలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమౌతున్నాయని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఎండి మసియుల్లాఖాన్ తెలిపారు. హజ్యాత్రకు వెళ్లే వారు ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోక పోతే పాతబస్తీలోని శాలిబండలోని అస్రా ఆసుపత్రి లో పదిహేను, పదహారు తేదీలలో వేయించుకోవాలని సూచించారు. విజయ నగర్ కాలనీలోని మజీద్ ఎ హుస్సేనిలో జరిగిన హజ్ యాత్రీకుల 11వ శిక్షణా కార్యక్రమానికి ఎండి మసియుల్లాఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హజ్ యాత్రీకులు విమానాలలో టికెట్లను ఏ విధంగా బుక్ చేసుకోవాలని వివరించారు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ హజ్ యాత్రీ కులకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మూడు రాష్ర్టాలకు చెందిన హజ్ యాత్రీకులకు వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హజ్ యాత్రీకులు అవసరం లేని సామాగ్రిని తమ వెం ట తీసుకు పోవద్దని సూచించారు. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో అవసర మైన అన్ని సామాగ్రి లభిస్తుందన్నారు. హజ్కు వెళ్లే యాత్రీకులు పూర్తి స్థాయి లో శిక్షణను పొందాలని, శిక్షణలో ఇచ్చిన సూచనలను తప్పక పాటించాలని కోరారు. స్కాలర్ మౌలానా షా మహ్మద్ జమాల్ ఉర్ రహమాన్, తెలంగాణ హజ్ కమిటీ ఎఈఓ ఇర్ఫాన్ షరీఫ్లు మాట్లాడుతూ హజ్ యాత్రీకులు మక్కా, మదీనాలో అసవరమైన వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు అబు తల్హా అంజద్, మహ్మద్ ఆరీఫుద్దీన్, కదీముల్ హుజ్జాజ్ తదితరులు పాల్గొన్నారు.
9. భద్రాద్రి రామాలయంలో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. అర్చకులు ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, ఆరాధన, పుణ్యవచనం, సేవాకాలం తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు క్యూలైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి రాముని నిత్య కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. భక్తుల రాక సందర్భంగా రామాలయం ప్రాంగణం సందడిగా కనిపించింది.
10. శుభమస్తు
తేది : 15, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఇండువాసరే (సోమవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 55 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 48 ని॥ వరకు చతుర్దశి తిధి తదుపరి పూర్ణిమ తిధి)
నక్షత్రం : మూల
(నిన్న సాయంత్రం 5 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 51 ని॥ వరకు మూల నక్షత్రం తదుపరి పూర్వాషాడా నక్షత్రం )
యోగము : (బ్రహ్మం ఈరోజు తెల్లవారుఝాము 3 గం ll 27 ని ll వరకు తదుపరి ఐంద్రం రేపు తెల్లవారుఝాము 3 గం ll 14 ని ll వరకు)
కరణం : (తైతుల ఈరోజు తెల్లవారుఝాము 0 గం ll 58 ని ll వరకు )
(గరజి ఈరోజు మద్యాహ్నము 1 గం ll 28 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 22 ని ll)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 5 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 51 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 26 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 2 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
గుళికలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 22 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 38 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : ధనుస్సు
11. నేటి ఆణిముత్యం *
భయము నెరుగని వాడు నిబ్బరము తోడ
జయము పొందును లక్ష్యపు జాడ నెరిగి;
భయము చేతనె సందేహ పడెడి వాడు
నెట్లు ఛేదించు లక్ష్యంపు టెరుక లేక
*భావము :*
భయం తెలియనివాడు ఎంతో ధైర్యంతో లక్ష్యాన్ని ఛేదించి జయం పొందుతాడు. భయంతో సందేహించేవాడు ఏ విధంగాను లక్ష్యం సాధించలేడు.
12. నేటి సుభాషితం*
*కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.*
13. నేటి సామెత *
*తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు*
తడి గుడ్డతో గొంతు కోయడం అసాద్యం: అలాంటి దుర్మార్గపు పనులను గుట్టు చప్పుడు కాకుండా చేసేసి ఏమి ఎరనట్టు వుండె వారిని గురించి ఈ సామెత పుట్టింది. వీడు తడి గుడ్డతో గొంతు కోసె రకం అని అంటారు.
14. నేటి జాతీయం**కంపలో కాసిన కాయ*
ఉండి కూడా ఉపయోగించుకోలేనిది.ముళ్ళ కంప మధ్యలో అందుబాటులో లేకుండా కాసిన కాయ. దాన్ని కోయడానికి వీలుపడదు. అందుబాటులో లేని సంపద ఉద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు.
*శుభోదయం*
*మహానీయుని మాట*
మంచిపని చేయలనుకున్నపుడు దాన్ని వెంటనే చేసెయ్యాలి.”
15. మన ఇతిసాలు
*రామ, సుగ్రీవుల మైత్రీబంధమే..*
మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడవలె అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. మనిషి సౌశీల్యం అతడు పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఆభిజాత్యాన్నిగానీ ఐశ్వర్యాన్నిగానీ విద్యనుగానీ పదవినిగానీ దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. ఆ దృష్టి లేనివాడే సౌశీల్యమూర్తి. అలాంటి సౌశీల్యరూపుడు శ్రీరామచంద్రుడు. రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా దర్శనమిస్తారు. రాముడు చక్రవర్తి అయినా.. గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని రామసుగ్రీవులు చాటారు. వారిద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీవుని భార్య రుమను వాలి తన అధీనంలోకి తీసుకుంటే.. సీతాదేవిని రావణుడు అపహరించాడు. రామ, సుగ్రీవుల మైత్రీబంధమే.. రుమ, సీతల విముక్తికి కారణమైంది. శత్రువు సోదరుడైనా సరే.. అధర్మాన్ని ఎదిరించి వచ్చినందుకు విభీషణుడితో రాముడు స్నేహం చేశాడు.
‘మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’..
మిత్రభావంతో వచ్చినవానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు.
ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః
వయస్యార్థే ప్రవర్తన్తే స్నేహం దృష్ట్వా తథావిధమ్‌
..అన్నారు వాల్మీకి మహర్షి.
నిజమైన స్నేహానికి ధనాన్నైనా, శరీర సుఖాన్నైనా, చివరకు దేహాన్నైనా త్యాగం చేయాల్సిందే తప్ప స్నేహాన్ని వదలరాదని దీని భావము.
16. తిరుమల సమాచారం
నమో వేంకటేశాయ ఈరోజు సోమవారం 15-07-2019 ఉదయం 5 గంటల సమయానికి.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ….. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు…శ్రీ వారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ 14 న 89,376 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.65తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
17. మన ఇతిహాసాలురామ, సుగ్రీవుల మైత్రీబంధమే..
మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడవలె అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. మనిషి సౌశీల్యం అతడు పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఆభిజాత్యాన్నిగానీ ఐశ్వర్యాన్నిగానీ విద్యనుగానీ పదవినిగానీ దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. ఆ దృష్టి లేనివాడే సౌశీల్యమూర్తి. అలాంటి సౌశీల్యరూపుడు శ్రీరామచంద్రుడు. రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా దర్శనమిస్తారు. రాముడు చక్రవర్తి అయినా.. గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని రామసుగ్రీవులు చాటారు. వారిద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీవుని భార్య రుమను వాలి తన అధీనంలోకి తీసుకుంటే.. సీతాదేవిని రావణుడు అపహరించాడు. రామ, సుగ్రీవుల మైత్రీబంధమే.. రుమ, సీతల విముక్తికి కారణమైంది. శత్రువు సోదరుడైనా సరే.. అధర్మాన్ని ఎదిరించి వచ్చినందుకు విభీషణుడితో రాముడు స్నేహం చేశాడు.
‘మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’..
మిత్రభావంతో వచ్చినవానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు.
ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః
వయస్యార్థే ప్రవర్తన్తే స్నేహం దృష్ట్వా తథావిధమ్‌..అన్నారు వాల్మీకి మహర్షి.నిజమైన స్నేహానికి ధనాన్నైనా, శరీర సుఖాన్నైనా, చివరకు దేహాన్నైనా త్యాగం చేయాల్సిందే తప్ప స్నేహాన్ని వదలరాదని దీని భావము.
18. శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. రేపు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా.. నేటి సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి ఎల్లుండి ఉదయం 5.30 గంటలకి గుడిని తెరచి సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నారు.
19. శ్రీవారిని వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు
తిరుమల శ్రీవారిని సిద్దిపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్ర్తాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీష్‌రావు పేర్కొన్నారు.
20. చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రా|| 7 నుండి మరునాడు ఉ|| 5 గం||ల వరకు శ్రీవారి ఆలయం మూత
జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16వ తేదీ రాత్రి 7 నుంచి మ‌రుస‌టిరోజు తెల్లవారుజామున 5 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం త‌లుపులు మూసివేస్తారు. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది. జూలై 17వ తేదీ బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.
21.జూలై 16న కోయిల్ ఆళ్వారు తిరుమంజ‌నం
తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం సంద‌ర్భంగా జూలై 16వ తేదీ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 11.00 గంటల వ‌ర‌కు తిరుమంజనం కార్యక్రమం నిర్వ‌హిస్తారు.
*స‌ర్వ‌ద‌ర్శ‌నం
ఈ నేప‌థ్యంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం ఉండదు. కావున‌ జూలై 16న మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేవలం 5 గంటలు మాత్రమే భక్తులకు దర్శన సమయం ఉంటుంది.
ఈ కారణంగా జూలై 15వ తేదీ అర్ధ‌రాత్రి 12.00 గంట‌ల వ‌ర‌కు ర‌ద్దీని అనుస‌రించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్ల‌లోనికి భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. వీరికి జూలై 16న మ‌ధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. జూలై 16వ తేదీ స‌మ‌యాభావం కార‌ణంగా భ‌క్తుల‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనికి అనుమ‌తించ‌రు. జూలై 17వ తేదీ బుధ‌వారం ఉద‌యం 5.00 గంట‌ల నుండి మాత్ర‌మే స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనికి అనుమ‌తిస్తారు.
22. జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల రద్దు
శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టిటిడి రద్దు చేసింది.
*వయో వృద్దులు, దివ్యాంగులు
ఈ నేప‌థ్యంలో ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సుప‌థం ద్వారా సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను జూలై 16వ తేదీ మంగ‌ళ‌వారం టిటిడి రద్దు చేసింది.
*జూలై 16న పౌర్ణమి గరుడుసేవ రద్దు
ఈ నెల 16వ తేది మంగ‌ళ‌వారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది.
*జూలై 16న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 16వ తేదీ మంగ‌ళ‌వారం రాత్రి 7.00 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి జూలై 17వ తేదీ బుధ‌వారం ఉదయం 9.00 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి-2, విక్యూసి-2, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, టిటిడి ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనాలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు. భక్తుల సౌకర్యార్థం ముదస్తుగా టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 20 వేల పులిహోర, టమోట అన్నం ప్యాకెట్లను జూలై 16వ తేదీ సాయంత్రం 3.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలు, నాదనీరాజనం వేదిక, మ్యూజియం వ‌ద్ద‌, వైభ‌వోత్స‌వ మండ‌పం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.
*జూలై 17న శ్రీ‌వారి ఆల‌యంలో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ ర‌ద్దు
రుమల శ్రీవారి ఆల‌యంలో ప్ర‌తిరోజు తెల్ల‌వారుజామున భ‌క్తుల‌కు క‌ల్పించే అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ను జూలై 17వ తేదీ చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్య‌క్ర‌మాలు నిర్వహించ‌నున్నారు.
*జూలై 16, 17వ తేదీల్లో ఆర్జితసేవలు రద్దు
జూలై 16న మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంతోపాటు చంద్రగ్రహణం కారణంగా అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు ర‌ద్ద‌య్యాయి. అదేవిధంగా జూలై 17న ఆణివార ఆస్థానం కార‌ణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
23. శాకంబరి అలంకరణలో మావూళ్లమ్మ
భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారు ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకొని శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు నాలుగు టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ఆలయాన్ని, అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన నాలుగురకాల కేప్సికమ్‌ కాయలతో, వంకాయలు, టమోటా, ఆనపకాయలు, క్యారెట్‌, బీట్‌రూట్‌, దోసకాయ, వాక్కాయలతో దండలు చేసి అలంకరించారు. అమ్మవారి అలంకరణ రేపు సాయంత్రం 6గంటల వరకు ఉంటుందని భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కొట్టు సత్యనారాయణ తెలిపారు. రేపు గురుపౌర్ణమి గ్రహణం కారణంగా సోమవారం ముందురోజునే అమ్మవారిని అలంకరించినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ డి.శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.