ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కేజిఎఫ్ సిరీస్, కాంతార లాంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ బ్యానర్ మీద ఈ సినిమాని విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి బాహుబలి సిరీస్ లాంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ కి ఆ స్థాయిలో సరైన హిట్ పడలేదు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఆ స్థాయి హిట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడినా ప్రమోషన్స్ లేకపోవడంతో కాస్త నిరాశలో ఉన్నా సరే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ వస్తూ ఉండడం అభిమానులకు కాస్త ఊరట ఇచ్చే అంశమే.
అయితే ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాను సలార్ సినిమాకి 100 టికెట్లు స్పాన్సర్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు. తాను హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ తెల్లవారు జామున ఒంటి గంట షో చూస్తున్నానని చెబుతూ ఆ షో కి 100 టికెట్లు తాను గివ్ ఎవే ఇస్తున్నానని ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ టికెట్లు అందజేస్తానని చెప్పుకొచ్చాడు. పదేళ్ల క్రితం తాను మిర్చి సినిమాకి ఇలాగే ఒంటిగంట షో చూశానని, ఇప్పుడు మళ్లీ హిస్టరీ రిపీట్ చేద్దామంటూ నిఖిల్ సిద్ధార్థ్ కామెంట్స్ పెట్టడంతో ప్రభాస్ అభిమానులు అందరూ తమకు ఆ 100 టికెట్లలో టికెట్ కేటాయించాలని ఆయనను అభ్యర్థిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –