DailyDose

ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందా?

ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందా?

‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం’ అనేది సంస్థ నినాదం. టైరు ఊడిపడిన ఘటనను బట్టి సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కోహెడ మండలంలోని నకిరేకొమ్ములలో పల్లె వెలుగు మినీ బస్సు టైరు ఆదివారం ఊడింది. హుస్నాబాద్‌ నుంచి కోహెడ మీదుగా కరీంనగర్‌ వెళుతోంది. నకిరేకొమ్ములలో బస్సు టైరు ఊడిపోయింది. పక్కనే ఉన్న పత్తి చేనులో పడిపోయింది.బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాహనాన్ని సరిగా పరీక్షించకుండానే వదులుతున్నారని ప్రయాణికులు ఆరోపించారు. హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వర్లను అడుగగా ప్రయాణికులను వేరే బస్సులో పంపించామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z