తెలంగాణలో స్టాఫ్‌నర్సు(Staff Nurse) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించగా.. దాదాపు 40వేల మంది రాశారు. తాజాగా ఈ పరీక్ష తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసినట్లు టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(MHSRB) ప్రకటించింది. తమ అధికారిక వెబ్సైట్లో ప్రాథమిక జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు పొందిన పాయింట్లపై అభ్యంతరాలను ఈ నెల 20లోపు ఆన్లైన్లో తెలపవచ్చని సూచించారు. అయితే, అభ్యర్థుల ప్రాథమిక జాబితా (ఫలితాలు) ఇంకా వెబ్సైట్లో అందుబాటులోకి రాలేదు.
👉 – Please join our whatsapp channel here –