ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా (Motorola) తన ఫ్లిఫ్ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఫ్లిప్ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉండనుంది. రేజర్ 40 (Razr 40), రేజర్ 40 అల్ట్రా (Razr 40 Ultra) మొబైల్ ఫోన్లపై రూ.10వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు డిసెంబరు 15న సంస్థ ప్రకటించింది.
డిసెంబరు 18 నుంచి 24 మధ్య మోటో డేస్‌లో కొనుగోలు చేసిన వారికి ఈ మొబైల్స్‌పై అదనపు తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. రేజర్ 40 అల్ట్రా మొబైల్ ఫోన్ రూ.10వేల డిస్కౌంట్‌తో ధర రూ.79,999గా ఉండగా.. దీనిపై రూ.7 వేల అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఈ మొబైల్‌ని రూ.72,999కే కొనుగోలు చేయొచ్చు. ఇక రేజర్ 40 మొబైల్‌ని అదనంగా రూ.5 వేల తగ్గింపుతో రూ.44,999కే అందిస్తోంది. 9 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –