తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి తిరుపతిలో జారీచేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎల్లుండి మధ్యహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు కేటాయించనుంది టీటీడీ.. తిరుపతిలో 9 కేంద్రాల వద్ద 94 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు అధికారులు.. రోజుకి 42,500 చొప్పున మొత్తం 4.25 లక్షల టికెట్లను వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించింది టీటీడీ..
కాగా, ఈ నెల 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార భక్తులకు దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. రద్దీ పెరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. వైకుంఠ ద్వార దర్శనం కల్పించే ఈ పది రోజుల పాటు సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశారు.. ఒకవేళ వీఐపీలు.. వారి కుటుంబసభ్యులతో వస్తే మాత్రం దర్శనం టికెట్లు కేటాయించనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది టీటీడీ.. ఇక, వైకుంఠ ద్వారా దర్శనాలకు వచ్చే భక్తుల కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్ల ద్వారా 4,23,500 సర్వదర్శనం టోకెన్ల కేటాయించనున్నారు. ఈ టికెట్లను డిసెంబర్ 22వ తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వనున్నారు.
మరోవైపు, సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైమ్‌స్లాట్ టోకెన్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. దీనిద్వారా క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని తెలిపింది.. తిరుపతిలో టోకెన్లు తీసుకున్న తర్వాతనే తిరుమలకు రావాలని భక్తులకు సూచించారు. టికెట్లు లేకుండా కూడా తిరుమలకు రావచ్చు.. కానీ, వారికి దర్శనం ఉండదని స్పష్టం చేసింది టీటీడీ. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ తెల్లవారుజామున 1.45 గంటల నుంచి తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. ఉత్తర ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచబడుతుంది..జనవరి 1, 2024 అర్ధరాత్రి మూసివేయనున్నారు. తిరుపతిలోని తొమ్మిది వేర్వేరు పాయింట్లలోని తొంభై కౌంటర్లలో సుమారు 4,23,500 స్లాటెడ్ సర్వ దర్శన్ (SSD) టోకెన్లు జారీ చేయబడతాయి. దర్శనానికి సంబంధించిన తేదీ, సమయంతో కూడిన టోకెన్లను మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒకేసారి జారీ చేస్తారు. డిసెంబర్ 22న టీటీడీ విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజ చౌల్ట్రీస్, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదాన్, జీవ కోన హైస్కూల్, ఎంఆర్ పల్లి జెడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామా నాయుడు స్కూల్లో అందుబాటులో టోకెన్లను అందుబాటులో ఉంచనున్నారు.
👉 – Please join our whatsapp channel here –