ఆన్లైన్ వెల్త్ మేనేజ్మెంట్ సేవలను పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. 50,000 మందికి పైగా సేల్స్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా, మరింత మంది మర్చంట్లను తమ నెట్వర్క్లో జత చేసుకుంటామని తెలిపారు. తద్వారా అనుకున్న సమయం కంటే ముందే కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తామని వివరించారు. ఆన్లైన్ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్న యువ వినియోగదార్ల కోసం మనీ మేనేజ్మెంట్ పథకాలను పేటీఎం సవరిస్తోందని తెలిపారు. చిన్న నగరాలు, పట్టణాల్లో ఎక్కువ మంది వ్యాపారులను తమ వేదికపైకి తీసుకొచ్చేందుకు 60 శాతానికి పైగా సేల్స్ఫోర్స్ను ప్రచారానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలతో పేటీఎం వ్యాపార రూపు మారుతుందని పేర్కొన్నారు. కాగా 2021లో ఐపీఓకు వచ్చిన తర్వాత పేటీఎం మార్కెట్ విలువ సుమారు 70 శాతం వరకు పడిపోయింది.
👉 – Please join our whatsapp channel here –