DailyDose

టీడీపీ జనసేనపై  విమర్శలు గుప్పించిన అంబటి -తాజా వార్తలు

టీడీపీ జనసేనపై  విమర్శలు గుప్పించిన అంబటి -తాజా వార్తలు

దివ్యాంగులను కించపరిచేలా ప్రసంగాలు

రాజకీయ పార్టీలు, నేతలు ఉపయోగించే భాషపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలని స్పష్టం చేసింది. మూగ, పాగల్‌, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను నేతలు వాడకుండా ఉండాలని ఈసీ సూచించింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలు నిషేధించాల్సిన ఆవశ్యకత ఉందని, ఇది అవమానకరమైన భాష కాబట్టి… అన్ని పార్టీలు సహకరించాలని తమ నేతలకు తగిన సూచనలు ఇవ్వాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.రాజకీయ ప్రసంగాల్లో దివ్యాంగులకు న్యాయం, గౌరవం కల్పించాలని ఈసీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు తమ రచనలు/కథనాలు/ ప్రచారంలో… ఏదైనా బహిరంగ ప్రకటన లేదా ప్రసంగం సమయంలో దివ్యాంగులపై చెడు/అవమానకరమైన పదాలు ఉపయోగించకూడదని తెలిపింది. రాజకీయ పార్టీలు మరియు వాటి ప్రతినిధులు ఏదైనా బహిరంగ ప్రసంగంలో, రాజకీయ ప్రచారంలో మానవ అసమర్థత సందర్భంలో దివ్యాంగులు, వైకల్యం ప్రతిబింబించే విధమైన పదాలు వాడకూడదని పేర్కొంది. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు వికలాంగుల వైకల్యానికి సంబంధించిన వ్యాఖ్యలను ఖచ్చితంగా నివారించాలి, అవి అభ్యంతరకరమైనవి, పక్షపాతాలను శాశ్వతం చేస్తున్నాయని ఈసీ అభిప్రాయపడింది..ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలతో సహా అన్ని ప్రచార సామాగ్రిలో వికలాంగుల పట్ల అసహ్యకరమైన లేదా వివక్షతతో కూడిన భాషాపరంగా… ఉన్న పదాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి రాజకీయ పార్టీ అంతర్గత సమీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో వైకల్యం, లింగ సున్నితమైన భాషను ఉపయోగిస్తాయని నిర్ధారించుకుంటున్నట్లు ప్రకటించాలని ఆదేశించింది. అన్ని రాజకీయ పార్టీలు దివ్యాంగులను గౌరవిస్తున్నట్లు తమ పార్టీ వెబ్‌సైట్‌లో ప్రధానంగా ప్రచురించాలని ఈసీ సూచించింది.

* టీడీపీ జనసేనపై  విమర్శలు గుప్పించిన అంబటి 

టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. లోకేష్ యువగళం సభ అట్టర్ ఫ్లాపైందని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ తన క్యాడర్‌ను మోసం చేస్తున్నారన్న అంబటి రాంబాబు..పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లను పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు తిట్టారని, అలాంటి పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిశారని అంబటి రాంబాబు అన్నారు.

* గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు 

విజయవాడలోని గుణదల మేరీమాతను తెదేపా అధినేత చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి..  పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్‌ మీరా పాల్గొన్నారు.

లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధిక వాయిదాపడింది. షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, సీఈసీ నియామకాల బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్‌ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. అయితే, ఈ నెల 13న పార్లమెంట్‌లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసిన తెలిసిందే. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో నిరసన తెలిపాయి.ఈ క్రమంలో లోక్‌సభతో పాటు రాజ్యసభలో 143 మంది సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. ఈ సారి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించింది. కొత్తగా తీసుకొని వచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, సెంట్రల్‌ యూనివర్సిటీల సవరణ బిల్లు, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, ఎలక్షన్‌ కమిషనర్ల నియామకం తదితర బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అలాగే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెండ్‌ సైతం విధించారు. డబ్బులకు ప్రశ్నలకు కేసు వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ఆమోదించిన అనంతరం మహువాను లోక్‌సభ బహిష్కరించింది.

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఈడీ స‌మ‌న్లను బేఖాత‌రు చేస్తూ ఢిల్లీ సీఎం ప‌ది రోజుల విపాస‌న మెడిటేష‌న్ క్యాంప్‌, పంజాబ్‌కు వెళ్లారు. ఇక ఈడీ త‌న‌కు పంపిన స‌మ‌న్లు అక్రమ‌మ‌ని, రాజ‌కీయ దురుద్దేశంతో కూడిన‌వ‌ని కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. ‘ఈ సమన్లు స్వీకరించడానికి నేను సిద్ధం. కానీ, గతంలో ఇచ్చిన వాటివలే ఈ సమన్లు కూడా చట్టవిరుద్ధమే. ఇవి రాజకీయంగా ప్రేరేపితమైనవి. వీటిని ఉపసంహరించుకోవాలి. నేను నిజాయతీతో పారదర్శకంగా జీవిస్తున్నాను. నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు’ అని కేజ్రీవాల్ స్పందిచారు.

* రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పర్యటన రద్దయింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

తొలి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్

సొంత గ‌డ్డ‌పై భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు(Womens cricketTeam) తిరుగులేని ఆధిప‌త్యం చెలాయిస్తోంది. ఇంగ్లండ్‌ను 347 ప‌రుగుల‌తో చిత్తు చేసిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్(Harmanprit Kaur) సేన ఆస్ట్రేలియాను హ‌డలెత్తిస్తోంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న‌ ఏకైక టెస్టులో భార‌త బౌల‌ర్లు మ‌రోసారి త‌మ‌ త‌డాఖా చూపించారు. వ‌స్త్రాక‌ర్,స్నేహ్ రానా దెబ్బ‌కు కంగారూ జ‌ట్టు 219 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.ఆ త‌ర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ వికెట్ కోల్పోకుండా ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు షెఫాలీ వ‌ర్మ‌(28), స్మృతి మంధానా(30) ధాటిగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ ఇంకా 152 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఆది నుంచి త‌డ‌బ‌డింది. తొలి ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(0) ర‌నౌట‌య్యింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే డేంజ‌ర‌స్ ఎలిసా పెర్రీ(4)ని పూజా వ‌స్త్రాక‌ర్ వెన‌క్కి పంపింది. బేత్ మూనీని(40 ), స‌థ‌ర్‌లాండ్(16) ఇన్నింగ్స్ నిర్మించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వ‌రుస విరామాల్లో భార‌త బౌల‌ర్లు వికెట్లు తీస్తూ కంగారూల‌ను ఒత్తిడిలోకి నెట్టారు. వ‌స్త్రాక‌ర్ నాలుగు, స్నేహ్ రానా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ‌తీశారు. దాంతో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 219 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది.

* రాజకీయాలకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యే

ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈయన రూటే సెపరేట్. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అని అంటూ ఉంటారు. ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఈయన నైజం. అధినేత దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆయనకు నచ్చితే పొగడటం నచ్చకపోతే మెుహం మీదే విమర్శించడం ఆయనకు అలవాటు. ప్రజలకు సేవ చేయడంలో కూడా అంతే దూకుడుగా ఉంటారు. తన వంతు సాయం చేయాలనుకునే వారికి ఖచ్చితంగా సాయం చేసి తీరుతారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇక పంతానికి పోతే ఎవరిని సైతం లెక్కచేయరు. తండ్రిని సైతం వదిలించుకోవడానికి రెడీ అవుతుంటారు. ఏదైనా ముఖంమీద కుండబద్దలు కొట్టే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో వర్గపోరును తట్టుకోలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై దీర్ఘాలోచనలోకి వెళ్లారు. వైసీపీ అధిష్టానం టికెట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్న తరుణంలో వైసీపీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్‌కు ఫోన్ చేయగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని..తాడేపల్లి రాలేనని కుండబద్దలు కొట్టేశారు. దీంతో వైసీపీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎపిసోడ్ ఉత్కంఠగా మారింది.ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం కసరత్తు మెుదలు పెట్టింది. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలతోపాటు గెలుపు గుర్రాలు, పది సర్వేల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ అధ్యయనం చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టబోతున్నారు. అభ్యర్థుల మార్పు చేసేవారిని తన వద్దకు పిలిపించి సీఎం జగన్ మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్లు ఎందుకు నిరాకరిస్తుంది…ఎందుకు మార్చాల్సి వస్తుందో సీఎం వైఎస్ జగన్ సిట్టింగ్‌లకు వివరిస్తున్నారు. అంతేకాదు టికెట్ ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో అనేదానిపై వారి భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ 36 మందికి పైగా ఎమ్మెల్యేలతో సమావేశమై టికెట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. నేడో రేపో మరో రెండు జాబితాలు రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు మెుదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు పిలుపు వచ్చింది. తాడేపల్లికి రావాలని ఆదేశించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z