సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ టౌన్, హైదరాబాద్ -తిరుపతి రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
కాచిగూడ -కాకికనాడ టౌన్ రైలు (07653) గురువారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
కాకినాడ టౌన్- కాచిగూడ రైలు (07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.
హైదరాబాద్ -తిరుపతి రైలు (07509) గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
తిరుపతి – హైదరాబాద్ రైలు (07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
కాచిగూడ-కాకినాడ టౌన్-కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నం.07653/07654) మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గగుగంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
హైదరాబాద్ -తిరుపతి- హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (రైలు నం.07509/07510) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
👉 – Please join our whatsapp channel here –