Business

విస్తారా ఎయిర్‌లైన్స్ అద్భుతమైన ఆఫర్

విస్తారా ఎయిర్‌లైన్స్ అద్భుతమైన ఆఫర్

ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ‘విస్తారా ఎయిర్‌లైన్స్’ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విస్తారా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ సేల్‌లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు.

క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్‌లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924.

విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి.

అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్‌ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999.

విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z