మేషం
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఏ ప్రయ త్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం
వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. చేప ట్టిన పనులు చురుకుగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో కొద్దిగా వివాదాలు తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగు తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కాస్తంత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
మిథునం
గృహ, వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేప ట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. జీతభత్యాల విషయంలో ఉద్యోగులకు శుభవార్తలు అందు తాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. నిరు ద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు.
కర్కాటకం
వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు దగ్గరవు తారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.
సింహం
కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వ్యాపారాల్లో సొంత ఆలోచ నలు కలిసి వస్తాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య
అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలిస్తాయి. వ్యాపారాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయ డం మంచిది కాదు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.
తుల
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులో విజయాలు సాధిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
వృశ్చికం
కుటుంబసమేతంగా ఇష్టమైన దేవాలయాలు సందర్శిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేస్తారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచు తారు.
ధనుస్సు
తలపెట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. దైవ చింతన పెరుగు తుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి కాస్తంత బయటపడతారు. ప్రయాణాలు బాగా లాభి స్తాయి. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధి స్తారు.
మకరం
సోదరులతో వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుద లగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికా రుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. రుణ సంబంధమైన ఒత్తిళ్లు తగ్గుతాయి. ముఖ్యమైన ప్రయ త్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం నిలకడ గానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు విజయాలు సాధి స్తారు.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన పనులు కూడా ఆశించిన విధంగా నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచన లున్నాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
మీనం
వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచ నలున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి శుభ వార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు పరవాలేదు.