NRI-NRT

Breaking: తానా కోశాధికారిగా భరత్ పోటీ చేయవచ్చన్న కోర్టు

Breaking: తానా కోశాధికారిగా భరత్ పోటీ చేయవచ్చన్న కోర్టు

కొడాలి నరేన్ ప్యానెల్ నుండి తానా 2023 ఎన్నికల్లో కోశాధికారి అభ్యర్థిగా అట్లాంటాకు చెందిన భరత్ మద్దినేని పోటీ చేయవచ్చునని మేరీల్యాండ్ కోర్టు ఉత్తర్వులు(TRO) వెలువరించింది. ఈ-ఓటింగ్ సరళిలో నిర్వహించే ఈ ఎన్నికల్లో సభ్యులకు చేరే బ్యాలెట్‌పై కోశాధికారిగా భరత్ మద్దినేని పేరు ఉండాలని కోర్టు ఆదేశించింది. కాగా, తానా కార్యవర్గ సమావేశాలకు మూడుసార్లు కన్నా ఎక్కువగా గైర్హాజరయ్యాడనే కారణంగా భరత్‌ను తానా ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హుడిగా బోర్డు ప్రకటించింది. దీనితో పాటు మరే ఇతర పదవుల్లో పోటీ చేయకుండా నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించగా భరత్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

TANA 2023 Elections Raja Surapaneni
TANA 2023 Elections Sirisha Tunuguntla
TANA 2023 Elections Ravi Kiran Muvva
TANA 2023 Elections Ashok Babu Kolla
TANA 2023 Elections Tagore Mallineni
TANA 2023 Elections Sunil Pantra