చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అంటే పౌర్ణమి తరవాత వచ్చే 11వ రోజు, అలాగే అమావాస్య తరవాత వచ్చే 11వ రోజు ఏకాదశి. అధి దేవత శివుడు. ప్రతి నెలలో శుక్లపక్షనికి ఒకటి.. కృష్ణ పక్షనికి ఒకటి మొత్తం నెలలో రెండు ఏకాదశులు చొప్పున.. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఏకాదశి అనగానే హిందువులకు మొదటగా గుర్తుకొచ్చేది.. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశిలు. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. ఇలా ఏడాదిలో 12 బహుళఏకాదశులు వస్తాయి. అయితే ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే.. ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహరం తినకుండా ఉపవశం ఉంటారు. దీని వలన ఆరోగ్యం, శరీరంలో చురుకుదనం వస్తాయని పెద్దల నమ్మకం. తెలుగు నెలల్లో వచ్చే ఏకాదశి పేర్లు.. ఫలం గురించి ఈరోజు తెలుసుకుందాం..
చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమికి వచ్చే ఏకాదశి)ని ‘కామదా ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండడం వలన భక్తుల కోర్కెలు తీరుస్తుంది. చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి)ని ‘వరూధిని’ ఏకాదశి అని అంటారు. ఈరోజు పూజాదికార్యక్రమాలు సహస్ర గోదాన ఫలాన్ని ఇస్తాయి. వైశాఖ శుద్ధ కృష్ణపక్ష ఏకాదశిని ‘మోహిని’ అని అంటారు. ఈరోజు పూజ ఉపవశం దరిద్రుడిని కూడా ధనవంతుడిని చేస్తుందని నమ్మకం. వైశాఖ బహుళ శుక్ల పక్షం ఏకాదశిని ‘అపరా’ అని అంటారు. ఈరోజు రాజ్యప్రాప్తి లభిస్తుందని నమ్మకం. జ్యేష్ఠ మాసంలో పున్నమికి వచ్చే ఏకాదశిని ‘నిర్జల’ అని అంటారు. ఆహార సమృద్ధి ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘యోగిని’ అంటారు. ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. ఆషాఢ మాసంలో పున్నమికి ముందు వచ్చే ఏకాదశిని ‘దేవశయనీ’ లేదా తొలిఏకాదశి అని అంటారు. ఈరోజు విష్ణువు యోగనిద్రకు వెళ్తారని నమ్మకం. ఆషాఢ మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘కామికా’ అని అంటారు. కోరిన కోర్కెలు ఫలిస్తాయి. శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ‘పుత్రదా’ అని అంటారు. సత్సంతాన ప్రాప్తి. శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘ఆజా’ అని అంటారు. రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ. భాద్రపద పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ‘పరివర్తన’ ఆని అంటారు. ఈరోజు (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధిగా ఈ ఏకాదశిని పిలుస్తారు). భాద్రపద మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘ఇందిరా’ అని అంటారు. సంపదలు, రాజ్యము ప్రాప్తించును. ఆశ్వయుజము పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ‘పాపంకుశ’ అని అంటారు. పుణ్యప్రదం. ఆశ్వయుజము మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘రమా’ అంటారు. స్వర్గప్రాప్తి. కార్తీక పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశి ‘ప్రబోధిని’.. ఈరోజు యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు కనుక జ్ఞానసిద్ధి లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ కాదశి ‘ఉత్పత్తి. దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు). మార్గశిర పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశి ‘మోక్షదా. ఈరోజుని వైకుంఠ ఏకాదశిగా కూడా పిలుస్తారు. మోక్షప్రాప్తినిస్తుందని నమ్మకం. మార్గశిర మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశి ‘విమలా’ లేదా సఫలా అని అంటారు. ఈరోజు పూజాదికార్యక్రమాలు నిర్వహించడం అజ్ఞాన నివృత్తిని చేస్తుందని నమ్మకం. పుష్య మాసంలో పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశి ‘పుత్రదా’. పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి). పుష్య మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళఏకాదశి ‘కళ్యాణీ’. జీవితంలో ఈతిబాధా నివారిస్తుంది. మాఘ మాసంలో పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశి ‘కామదా’ .. శాపవిముక్తి. మాఘ మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘విజయా’ అని అంటారు. సకలకార్య విజయం. ఫాల్గుణ పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ‘ఆమలకీ’ అని అంటారు. ఆరోగ్యప్రదం. ఫాల్గుణ మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ‘సౌమ్య’ అని అంటారు. పాపవిముక్తి
అయితే హిందువులు ఏకాదశికి విష్ణువుని పూజించడమే కాదు.. ఉపవాశం కూడా ఉంటారు. కొందరు ఏకాదశి ముందు రోజు భోజనం చేసిన వారు.. మళ్ళీ ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేస్తారు.. ఇలా చేయడం వలన మన శరీరం తేలికగా అవుతుందని నమ్మకం.
👉 – Please join our whatsapp channel here –