రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల కోసం రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న ప్రారంభమై జనవరి ఆరో తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. దీనికి ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 7094 స్టాఫ్‌నర్స్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించగా 40,936 మంది పరీక్ష రాశారు.
👉 – Please join our whatsapp channel here –