Politics

BRS:‘స్వేద పత్రం’ విడుదల కార్యక్రమం వాయిదా!

BRS:‘స్వేద పత్రం’ విడుదల కార్యక్రమం వాయిదా!

భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ‘స్వేద పత్రం’ విడుదల కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది. ‘స్వేద పత్రం’ పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌(పీపీటీ)ను భారాస ఇవ్వనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. పలు కారణాల రీత్యా రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

‘స్వేద పత్రం’ విడుదలపై అంతకుముందు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోం. అందుకే గణాంకాలు సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్‌ వేదికగా ‘స్వేద పత్రాన్ని’ ప్రజల ముందు ఉంచనున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z