దేశంలో సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని నెలల్లో సమీపించనున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం పార్టీ అంతర్గత సమావేశాల్లో కనిపిస్తోంది. ఇటీవల జరిగి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సంపాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీజేపీ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికలను ఒక ‘మిషన్’గా భావిస్తూ.. బృందంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు.
‘మనం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచాము, 2024లో అంతకు మించి ఎంపీ సీట్లతో బీజేపీ గెలుపొందాలి. మన భావాలను సోషల్ మీడియాలో బలంగా వినిపిచాలి. ప్రతిపక్షాల వ్యకిరేతకమైన ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రజలకు బీజేపీ ప్రభుత్వ విధానాలు విరించాలి’ అని పిలపునిచ్చారు. ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ను కూడా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు.
👉 – Please join our whatsapp channel here –