భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ( Jagdeep Dhankhar ) ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ ( Hyderabad ) లో పర్యటించ నున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి ( CS Shanthakumari ) అధికారులతో రివ్యూ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఉపరాష్ట్రపతి తొలిసారిగా రాష్ట్రంలో పర్యటిస్తుడడంతో పోలీసు బందోబస్తుతో పాటు పోలీసు బ్యాండ్‌ను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయాలని సీఎస్ తెలిపారు.ఈ సమీక్షలో డీజీపి రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –