Politics

చంద్రబాబు ఇంట్లో మహా చండీ యాగం ముగిసింది!

చంద్రబాబు ఇంట్లో మహా చండీ యాగం ముగిసింది!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం, సుదర్శన హోమాల క్రతువు ఆదివారంతో ముగిసింది. పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు, తెదేపా నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40మంది రుత్వికులు.. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z