DailyDose

విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ

విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ

పదోతరగతి వరకే చదివాను.. ఇంటర్‌ మాత్రమే పూర్తిచేశాను ఈ విద్యార్హతలతో ఉద్యోగాలు సంపాదించడం ఎలా? చదువుకున్న చదువు.. తెచ్చుకొన్న మార్కులతో ప్రయోజనమేమి లేదే. మరీ ఇప్పుడెలా అన్న సంకోచక స్థితి నుంచి విద్యార్థులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. పాఠశాల దశలోనే విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

ఇలా రాష్ట్రంలోని 80 బడుల్లో వొకేషనల్‌ విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు 66 కేజీబీవీలను, 14 తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ గురుకులాలను ఎంపికచేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2023-24 సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ అప్రూవల్‌బోర్డులో ఈ స్కూళ్లల్లో వొకేషనల్‌ విద్య అమలుకు ఆమోదం లభించింది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) సహకారంతో ఈ కోర్సులను నిర్వహిస్తారు. ఎంపిక చేసిన బడుల్లోని 9, 11 తరగతుల్లో శిక్షణ ఇస్తారు. 10, 12 తరగతుల్లో ప్రాక్టికల్స్‌, పరీక్షలను నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ శిక్షణనిచ్చేందుకు పలు సంస్థలతో ఎంవొయూ కుదుర్చుకొన్నారు.

కోర్సులివే..
డొమెస్టిక్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌, మైక్రోఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, హోం హెల్త్‌ ఎయిడ్‌ ట్రెయినీ, అసిస్టెంట్‌ బ్యూటీ థెరపిస్ట్‌, సొలనాసియస్‌ క్రాప్‌ కల్టివేటర్‌, జామ్‌ జెల్లీ కెచప్‌ ప్రాసెసింగ్‌ టెక్నీషన్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ స్పిసర్‌, స్వీయింగ్‌ మిషన్‌ ఆపరేటర్‌ వంటి కోర్సులున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z