DailyDose

బుధవారం ఏపీ కేబినెట్ భేటీ-తాజావార్తలు–07/16

AP Cabinet To Meet Tomorrow-Daily Breaking News - July 16 2019-బుధవారం ఏపీ కేబినెట్ భేటీ-తాజావార్తలు–07/16

*రేపు(బుధవారం) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
*పరువునష్టం దావా కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. అయితే వ్యక్తిగత పూచికత్తు కింద రూ.10,000 డిపాజిట్ చేయాలని ఆదేశించారు. వివరాల్లోకెళితే.. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీలోని 30 లక్షల ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించిందంటూ ఆప్ నేతలు ఆరోపించారు. ఈమేరకు గతంలో ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆ రోపణలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని, ఆప్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజీవ్ బబ్బర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈసీని కోర్టు వివరణ కోరగా.. ఆప్ నాయకుల ఆరోపణలన్నీ అవాస్తవం తేల్చి చెప్పింది. అయితే తాజాగా ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆప్ నేతలు పిటిషన్ వేశారు. ఆ మేరకు కేజ్రీవాల్తో పాటు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, అతిషి నేడు కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా.. ఆయనకు ఆ హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది.
*కాపు రిజర్వేషన్ల అంశం ఇవాళ్టిది కాదని.. గత కొన్నేళ్లుగా ఆ సామాజికవర్గానికి చెందిన వారు పోరాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్లపై తనను విమర్శిస్తే తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని.. దానికి స్పీకర్ అవకాశం ఇవ్వాలన్నారు.
*తెలంగాణలో జీఎస్టీ చట్టం రాక మునుపు జరిగిన పన్ను అక్రమాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. అంతర్రాష్ట్ర సరకు రవాణా పేరుతో కోట్ల రూపాయల పన్ను ఎగవేతపై వాస్తవాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించింది.
*రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి జీఓ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు (ఎస్టాబ్లిష్మెంట్, రెగ్యులేషన్)-2018కి గత ఏడాది మార్చి 28న చట్టసభలు ఆమోదం తెలిపాయి.
*పాలసీ తీసుకున్నప్పుడు అప్పటికే ఉన్న వ్యాధిని వెల్లడించలేదని.. మరో వ్యాధితో మృతిచెందిన మహిళకు సంబంధించిన పాలసీ సొమ్మును తిరస్కరించడానికి వీల్లేదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది.
*పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. త్వరలో జరగనున్న నగర, పురపాలక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
*రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి జీఓ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు (ఎస్టాబ్లిష్మెంట్, రెగ్యులేషన్)-2018కి గత ఏడాది మార్చి 28న చట్టసభలు ఆమోదం తెలిపాయి.
*విజయవాడకు చెందిన స్టీలు వ్యాపారి రాంప్రసాద్ హత్యకు కుట్రదారు కోగంటి సత్యమేనని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. హత్యలో ముగ్గురు ప్రత్యక్షంగా పాల్గొనగా.. ప్రధాన నిందితుడు సత్యం సహా మొత్తం 11 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
*అధికారుల అవినీతికి సంబంధించి సరైన ఆధారాలు ఉన్నా.. వారికి అనుకూలంగా నివేదికలు ఇచ్చి కేసును మూసివేసినట్లు తెలితే.. క్రమశిక్షణాధికారులు (డిసిప్లినరీ అథారిటీస్) ఆ కేసులను తిరగదోడి పునర్విచారణ (డినోవో) చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్ని శాఖలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు.
* ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సల్లో, ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే ఖరీదైన ఔషధాలను తప్పనిసరి ఔషధ జాబితాలో చేర్చుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజాగా సిఫార్సు చేసింది. దీంతో ఖరీదైన పలు ఔషధాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
*ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యకళాశాలల్లోని బోధనాచార్యుల పదవీ విరమణ వయసును కూడా పెంచాలనే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది.
*అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సహాయకుల సెలవుల మార్గదర్శకాలకు ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవ వేతనం తీసుకోకుండా 180 రోజులు గుర్తించిన వ్యక్తిగత కారణాలపై సెలవులో వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
*గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఐకేపీ ఉద్యోగుల పాత్ర కీలకమైందని తెలంగాణ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి పేర్కొన్నారు. 50లక్షల మంది డ్వాక్రా మహిళలు, 20వేల గ్రామ సమాఖ్యలు, అయిదు లక్షల స్వయం సహాయక సంఘాలతో సెర్ప్ సంస్థ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
*నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్ కేంద్రం వరకు డబుల్ లైన్ రైలుమార్గం వేయాలని రైల్వేశాఖను జెన్కో సీఎండీ ప్రభాకరరావు కోరారు. ఈ విద్యుత్ కేంద్రానికి పూర్తిగా సింగరేణి నుంచి బొగ్గును తీసుకుంటామని దాని రవాణాకు రైల్వే లైను కీలకమన్నారు.
*కేంద్రం ఇకనైనా హైదరాబాద్- నాగ్పుర్ పారిశ్రామిక కారిడార్కు తుది అనుమతులు ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు వెంటనే ఆమోదం తెలపాలని, పనులను చేపట్టాలని కేంద్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయల్ను డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం దిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.
*శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం యాభై ఏళ్ల సందర్భంగా ఈ నెల 18న ‘రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర’ అనే అంశంపై బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు అమరుల బంధుమిత్రుల సంఘం(ఏబీఎంఎస్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సభ జరుగుతుందని పేర్కొంది.
*అగ్రిగోల్డ్ సంస్థలో అవ్వా హేమసుందర వరప్రసాద్ ఓ డైరెక్టరు. ఆ కుంభకోణంలో ఆరో నిందితుడు (ఏ6) కూడా. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్ల సొమ్మును దారి మళ్లించేందుకు సరికొత్త ఎత్తుగడలు వేశాడు. ఉనికిలోనే లేని వ్యక్తుల (ఉహాత్మక వ్యక్తులు) పేరిట నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేయించాడు.