తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం (డిసెంబర్ 26) ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి అపాయిట్‌మెంట్ ఖరారవ్వడంతో రేపు సాయంత్రం నాలుగు గంటలకు నరేంద్రమోదీతో ఇరు నేతలు భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ మేరకు రేప టిఖమ్మం పర్యటనను డిప్యూటీ సీఎం భట్టి రద్దు చేసుకున్నారు. కాగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయిన తరువాత తొలిసారి ప్రధానిని కలవబోతున్నారు రేవంత్, భట్టి.
అదే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలవనున్నారు. పార్లమెంట్ ఎన్నికల గురించి పార్టీపెద్దలతో చర్చించనున్నారు. తాజా రాజకీయాలు నామినేటేడ్ పోస్టుల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక బుధవారం నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననునున్నారు.
👉 – Please join our whatsapp channel here –