ఈ ముగ్గుల పండక్కి సినీప్రియుల కోసం ‘గుంటూరు కారం’తో దమ్ మసాలా బిర్యానీ సిద్ధం చేస్తున్నారు మహేశ్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి పాట చిత్రీకరణలో ఉంది. మహేశ్, శ్రీలీలపై చిత్రీకరిస్తున్న ఈ మాస్ గీతం నుంచి ఓ వర్కింగ్ స్టిల్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఈ స్పైసీ మాస్ నంబర్ థియేటర్లలో ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేస్తుందని, ఈ పాటలో మహేశ్, శ్రీలీల చితక్కొట్టేశారని చిత్ర వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా జనవరి 12న థియేటర్లలోకి రానుంది.
👉 – Please join our whatsapp channel here –