Movies

ఈ సినిమాకి ‘గోట్‌’ పేరు ఖరారైనట్టేనా?

ఈ సినిమాకి ‘గోట్‌’ పేరు ఖరారైనట్టేనా?

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ ప్రస్తుతం ‘దళపతి 68’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మల్టీస్టారర్‌ని వెంకట్‌ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ వన్‌ అక్రాస్‌ టైమ్స్‌) పేరు ఖరారైనట్టు సమాచారం. అయితే దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండటంతో.. టైటిల్‌ ఇంగ్లిష్‌లో ఉంటుందని చిత్రబృందం గతంలోనే పేర్కొంది. దానికనుగుణంగా ‘బాస్‌’, ‘పజిల్‌’ అంటూ రకరకాల పేర్లు బయటికొచ్చాయి. టైటిల్‌ అది కాదంటూ దర్శకుడు వాటిని కొట్టిపడేశారు. ప్రస్తుతం ఈ ‘గోట్‌’ మాత్రం ఖరారైనట్టే అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చర్చిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే దర్శకనిర్మాతలు ఈ ఊహాగానాలకు తెరదించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z