Business

పార్లేజీ బిస్కెట్‌ కంపెనీ ఉన్నట్టుండి సర్‌ప్రైజ్‌

పార్లేజీ బిస్కెట్‌ కంపెనీ ఉన్నట్టుండి సర్‌ప్రైజ్‌

ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ కంపెనీ బిస్కెట్‌ ప్యాకెట్లపై ఉండే పాప బొమ్మ బాగా పాపులర్‌. అయితే పార్లేజీ కంపెనీ ఉన్నట్టుండి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తమ పార్లే జీ బిస్కెట్‌ ప్యాకెట్‌ కవర్‌పై పాప బొమ్మను మార్చేసింది. ఆ స్థానంలో ఓ ఇన్‌ఫ్లుయన్సర్‌ ఫొటోను తీసుకొచ్చింది.

అయితే పార్లేజీ ఇదంతా చేసింది ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో. జెరాన్‌ జే బున్‌షా అనే ఇన్‌ఫ్లుయన్సర్‌ పోస్ట్‌ చేసిన ఓ వైరల్‌ వీడియోకు స్పందనగా పార్లేజీ.. తమ బిస్కెట్‌ ప్యాకెట్‌పై ఆయన ఫొటో ఉన్నట్లు రూపొందించి షేర్‌ చేసింది.

తాజాగా జెరాన్‌ జే బున్‌షా పార్లేజీపై తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘ఒక వేళ మీరు పార్లే ఓనర్‌ను కలిస్తే ఏమని పిలుస్తారు.. పార్లే సర్‌, మిస్టర్‌ పార్లే అనా లేక పార్లే జీ అనా?’ అంటూ అయోమయంలో ఉన్నట్లు వీడియో రూపొందించి షేర్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అధిక సంఖ్యలో వ్యూవ్స్‌, కామెంట్లు వచ్చాయి. చివరికి పార్లే కంపెనీ కూడా స్పందించింది. బిస్కెట్‌ ప్యాకెట్‌పై ఆ ఇన్‌ఫ్లుయన్సర్‌ ఫొటోను వేసినట్లుగా చిత్రాన్ని రూపొందించి తమ ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z