ప్రపంచంలోనే తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) మరోమారు స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన తెదేపా (TDP) ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రైతు కుటుంబంలో పుట్టి.. ఐటీని ప్రోత్సహించా. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు.. విజన్-2020 అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారు. వైకాపా పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి. రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలి. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే’’ అని చంద్రబాబు చెప్పారు.
అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు.. కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –