Business

ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా – బెంగళూరుల మధ్య నడిచే అమృత్‌ భారత్‌ ఎక్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో 12 స్లీపర్‌ తరగతి, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి. ఈ రైలు గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z