బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశ్న అడిగారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న ప్రశ్నకు యువతి సమాధానం చెప్పలేకపోయారు. ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్‌ను అమితాబ్ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధప్రదేశ్ అని ఆప్షన్లు ఇచ్చారు.
అయితే సమాధానం చెప్పలేకపోయిన యువతి.. ఆలోచనలో పడిపోయింది. దీంతో లైఫ్‌లైన్ తీసుకున్నది. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు. అది సరైన సమాధానం కావడంతో తదుపరి ప్రశ్నకు అర్హత సాధించారు.
👉 – Please join our whatsapp channel here –