DailyDose

భార్యకు వీడియో కాల్‌ చేసి లైవ్‌లో భర్త ఆత్యహత్య చేసుకున్న ఘటన

భార్యకు వీడియో కాల్‌ చేసి లైవ్‌లో భర్త ఆత్యహత్య చేసుకున్న ఘటన

భార్యకు వీడియో కాల్‌ చేసి లైవ్‌లో భర్త ఆత్యహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన ముత్తడి నరేష్‌(28) ఉప్పల్‌లోని సరస్వతి కాలనీలో భార్య నిత్యశ్రీతో కలిసి ఉంటున్నారు. మెట్రో రైలు సిగ్నలింగ్‌ విభాగంలో ఉద్యోగి. ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. భార్యది ఇదే జిల్లా అమ్మనబోలు గ్రామం. ఆమె గర్భిణి కావడంతో వారం క్రితం సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. ఆ రోజు నుంచి సీమంతానికి బంధువులను పిలిచే విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు… ఇదే క్రమంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి. మనస్తాపానికి గురైన నరేష్‌ శుక్రవారం భార్యకు వీడియో కాల్‌ చేశాడు. అప్పటికే ఫ్యాన్‌కు చీరను కట్టి ఉన్నాడు. భార్య చూస్తుండగానే ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z